తితిదే ధర్మకర్తల మండలి సమావేశం... తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో 2021-22 వార్షిక బడ్జెట్ ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. 80 అంశాలతో రూపొందించిన అజెండాతో పాటు కొన్ని కీలకమైన అంశాలు టేబుల్ అజెండాగా సమావేశం ముందుకు రానున్నాయి. కరోనా తగ్గు ముఖం పట్టి దర్శనాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్న వేళ.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే అంశంపై చర్చించనున్నారు.
ఆగమసలహా మండలి సభ్యుల నియామకం, 3 వందల మంది మాజీ సైనికులను భద్రతా విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన నియామకం, హైదరాబాద్ మింట్‌లో ఉన్న వెండి కరిగించే అంశం, రెండు గ్రాముల బంగారు డాలర్ల కొనుగోలు అంశాలపై చర్చించనున్నారు. ఆలయాలపై దాడుల రాయలసీమ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించి త్రిదండి చినజీయర్ స్వామి రూపొందించి తితిదేకు సమర్పించిన నివేదికను సమావేశంలో చర్చించనున్నారు.