ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 5న తితిదే ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం - వైకుంఠ ద్వార దర్శనం తాజా న్యూస్

శ్రీరంగం తరహాలో తిరుమలలో ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించాలని కోరుతూ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయమై తిరుమల అన్నమయ్య భవనంలో... తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

.
ఈనెల 5న తితిదే ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

By

Published : Jan 3, 2020, 11:55 PM IST

తిరుమల అన్నమయ్య భవనంలో... తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. శ్రీరంగం తరహాలో తిరుమలలో ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించాలని కోరుతూ... కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారించిన హైకోర్టు... పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే అంశంపై తితిదే తమ అభిప్రాయాన్ని ఆరో తేదీ నాటికి తెలియచేయాలని కోర్టు ఆదేశించింది. ఆగమశాస్త్రానికి లోబడి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే అంశంపై తితిదేకు ఎలాంటి వ్యతిరేకత లేదని తితిదే తరఫు న్యాయవాది వివరించారు. కానీ తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో దర్శన అవకాశం ఈ ఏడాది వీలుకాదని ఆయన తెలిపారు. తితిదే బోర్డు అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలియచేయాలని కోర్టు ఆదేశించటంతో.... ఆదివారం రోజున బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

ఈనెల 5న తితిదే ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

ABOUT THE AUTHOR

...view details