తిరుమలలోని కల్యాణ వేదికలో వివాహాలకు తితిదే అనుమతించింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి సామూహిక వివాహాలు నిర్వహించుకునేందుకు అనుమతి నిలిపివేసింది. భక్తుల కోరిక మేరకు పలు ఆంక్షలతో తిరిగి ప్రారంభించింది. కల్యాణ వేదికలో వివాహాలు నిర్వహించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది.
కొవిడ్ నిబంధనలతో తిరుమలలో కల్యాణాలకు పచ్చజెండా - తిరుమలలో కల్యాణలకు తితిదే అనుమతి
తిరుమలలోని కల్యాణ వేదికను ప్రారంభించనున్నట్లు తితిదే తెలిపింది. భక్తుల కోరిక మేరకు కొవిడ్ నిబంధనలతో ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నారు. అలాగే నామకరణాలు, ఉపనయనాలు, చెవిపోగులు కుట్టించటం వంటి వేడులకు కూడా అనుమతులు ఇవ్వనున్నారు.
తితిదే వెబ్‌సైట్‌లో కల్యాణ వేదిక పోర్టల్ ద్వారా వివరాలు పొందుపరిచి అనుమతి పొందాలన్నారు. ఈ పత్రంతో ఒక్కరోజు ముందుగా తిరుమలకు చేరుకుని కళ్యాణ వేదికవద్ద అధికారులను సంప్రదించి పరిశీలించుకోవాలని వివరించారు. వివాహానికి 15 మంది బంధుమిత్రులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని నిబంధన విధించారు. అలాగే నామకరణాలు, ఉపనయనాలు, చెవిపోగులు కుట్టించుకోవడానికి అనుమతించారు.
ఇదీ చదవండీ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజు