ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో మల్టీలెవల్ పార్కింగ్​కు తితిదే చర్యలు

తిరుమలలో రద్దీకి అనుగుణంగా వాహనాల పార్కింగ్​లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్​ను బాలాజీ నగర్ సమీపంలోకి మారుస్తామని స్పష్టం చేశారు.

ttd actions to developing multi level parkingin thirumala
తిరుమలలో మల్టీలెవెల్ పార్కింగ్

By

Published : Apr 9, 2021, 8:54 PM IST

తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా మల్టీలెవల్‌ పార్కింగ్‌లను అభివృద్ధి చేసేందుకు తితిదే చర్యలు ప్రారంభించింది. తితిదే ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు.

ప్రస్తుతం తిరుమల కొండపై 4వేల వాహనాలను నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ ప్రదేశం ఉందని, పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా మల్టీలెవల్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని తితిదే ఈవో తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను బాలాజీ నగర్‌ సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వెల్లడించారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,765 కేసులు

ABOUT THE AUTHOR

...view details