చిత్తూరు జిల్లాలోనే అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న శ్రీకాళహస్తిని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును, ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్ ఎస్పీ పర్యటన - శ్రీకాళహస్తి నేటి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్ ఎస్పీ పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్ ఎస్పీ పర్యటన