చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం జ్యూస్ పరిశ్రమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బిహార్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు పారిశ్రామికవాడలో గ్రానైట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులకు మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
జీవనోపాధి కోసం వస్తే... ప్రాణం పోయింది - dhee
పొట్టచేత పట్టుకుని రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చారు. ఆ పనీ, ఈ పనీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో విషాదం మిగిల్చింది. ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి