ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల సరఫరాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు - రికార్డు మొత్తంలో పాలను సరఫరా చేసిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ప్రారంభించిన దూద్​ దురంతో రైళ్ల ద్వారా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల లీటర్ల పాలను రవాణా చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పాల రవాణా ప్రారంభించిన తర్వాత ఎన్నడూ లేనంతగా అధిక మొత్తంలో ఈ ఏడాది చేరవేసినట్లు ప్రకటించారు.

sc railway created record in milk transportation
పాల సరఫరాలో రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే

By

Published : Mar 17, 2021, 7:39 PM IST

Updated : Mar 17, 2021, 8:42 PM IST

దూద్ దురంతో ప్రత్యేక రైళ్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల లీటర్ల పాల రవాణా మైలురాయిని అధిగమించాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లలో రవాణా ప్రారంభించిన తర్వాత.. ఎన్నడూ లేనంతగా అధిక మొత్తంలో పాలను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ప్రకటించారు.

2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన దూద్​ దురంతో రైళ్లు.. ఇప్పటివరకు ఏడాదికి సరాసరి 2 నుంచి 3 కోట్ల లీటర్ల పాలను మాత్రమే రవాణా చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. లాక్​డౌన్ సమయంలో పాల సరఫరా సవాలుగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 296 ట్రిప్పులలో మొత్తం 1,753 పాల ట్యాంకర్లతో 7 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేశామని వివరించారు.

Last Updated : Mar 17, 2021, 8:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details