బయోమెడికల్ నిర్వహణపై శిక్షణ ఆస్పత్రుల్లో బయో మెడికల్ నిర్వహణఅంశంపైరాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోతిరుపతిలోశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. ఆస్పత్రుల నుంచి చిన్న సిరంజికూడా బయట ఉన్న చెత్త కుండీల్లోకి రావటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అవగాహన లేని పారిశుద్ధ్య కార్మికులు.. అలాంటి వాటితో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఐఎంఏ అధికారులు ఈ విషయంలో సహకరించాలని కోరారు.చిన్న మందుల దుకాణం నుంచి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు ప్రతీ ఒక్కరూ రిజిస్టర్డ్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.