ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం - వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వార్తలు

చిత్తూరు జిల్లా రేణిగుంట.. మామండూరు వద్ద వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రైలు కప్లింగ్‌ లింక్‌ ఊడిపోయి ఇంజిన్‌, ఏసీ బోగీలు విడిపోయాయి. అర కిలోమీటర్‌కు పైగా.. జనరల్‌, స్లీపర్‌ బోగీలు దూరంగా జరిగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మామండూరు స్టేషన్‌లో అరగంట పాటు నిలిచిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ కు.. రైల్వే సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు చేశారు. అనంతరం రైలు.. రేణిగుంట వెళ్లింది.

train accident
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

By

Published : Feb 24, 2020, 9:44 AM IST

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details