అందరితో కలివిడిగా ఉండేవాడు: గౌతమి, సాయితేజ పిన్ని
సాయితేజ అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని అతడి పిన్ని గౌతమి చెప్పారు. గ్రామంలో పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ఎంతో సరదగా వచ్చి పాల్గొనేవాడన్నారు. తమకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవాడని ఆమె తెలిపారు. పిల్లలకు ఎన్నో మంచి మాటలు చెప్పేవాడని గౌతమి చెప్పారు. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని వారికి వివరించేవాడు. -గౌతమి, సాయితేజ పిన్ని
సాయితేజకు చిన్ననాటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి: స్నేహితుడు గోవర్ధన్
సాయితేజ చిన్ననాటి నుంచి సైక్లింగ్, రన్నింగ్‌లో ఎంతో ప్రతిభ చూపేవాడని స్నేహితుడు గోవర్ధన్ చెప్పారు. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి అతడికి ఉండేదని.. క్రీడల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండేవాడన్నారు. సాయితేజ స్నేహితుడు కావడం తమకు గర్వంగా ఉందని.. అదే సమయంలో అతడు అమరుడు కావడం బాధగా ఉంది. -గోవర్ధన్
సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు