సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
శ్రీకాళహస్తిలో..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. స్కిట్ కళాశాల నుంచి ఆర్టీసీ కూడలి వరకు సుమారు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.