ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anna Canteen: ట్రాక్టరే అన్న క్యాంటీన్‌గా.. కుప్పంలో తెదేపా నిత్యాన్నదానం - కుప్పంలో ట్రాక్టరే అన్న క్యాంటీన్‌గా మార్పు

Anna Canteen: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్టు పర్యవేక్షణలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలు నిత్యాన్నదానం చేపట్టారు. అయితే.. అన్న క్యాంటీన్‌ భవనం వైకాపా అధికారంలో వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోవటంతో.. ట్రాక్టర్‌ను క్యాంటీన్‌గా మలిచి ఆదివారం అన్నదానం ప్రారంభించారు.

tractor turned as anna canteen  in kuppam
ట్రాక్టరే అన్న క్యాంటీన్‌గా

By

Published : Jun 6, 2022, 9:02 AM IST

Anna Canteen: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్టు పర్యవేక్షణలో.. చిత్తూరు జిల్లా కుప్పంలో నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించతలపెట్టిన అన్న క్యాంటీన్‌ భవనం వైకాపా అధికారంలో వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది.

దీంతో ట్రాక్టర్‌ను క్యాంటీన్‌గా మలిచి ఆదివారం అన్నదానం ప్రారంభించారు. అన్నదానం చేయాలనుకునే దాతలు తెదేపా కార్యాలయాన్ని సంప్రదించాలని తెదేపా అధినేత చంద్రబాబు పీఏ మనోహర్‌ కోరారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details