ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ - మదనపల్లి తాజా వార్తలు

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ... దిల్లీలో ఉద్యమిస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా...చిత్తూరులో సీపీఎంతో కలిసి రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కర్షకులకు నష్టాన్ని కలిగించే ఈ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

tractor rally
ట్రాక్టర్ ర్యాలీ

By

Published : Jan 20, 2021, 2:58 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని... చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో పలు రైతు సంఘాలు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాయి. నీరుగట్టు వారి పల్లె నుంచి కదిరి రోడ్డు మీదుగా అన్నమయ్య కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న దిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీకి మద్దతు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details