చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. చింపిరివారి పల్లికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి (45) బురద మడిలో ఎత్తుగా ఉన్న గట్టు దాటుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఫలితంగా రైతు ఒక్కసారిగా ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ కింద పడిన మృత దేహాన్ని బయటకు తీశారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి - తంబళ్లపల్లె మండలం తాజా వార్తలు
బురద మడిలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలో జరిగింది. ఎత్తుగా ఉన్న గట్టు దాటుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టింది.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ
మృతదేహం వద్ద శ్రీనివాస్ భార్య జోష్న, మృతుని తల్లి విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. మృతి చెందిన రైతు శ్రీనివాసరెడ్డికి డిగ్రీ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని స్థానిక రైతులు ప్రభుత్వాన్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి.. వ్యక్తి మృతి