చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్ యార్డులో.. మాటా ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ సీజన్‌లో అసలే ధరలేక టమాటాను రోడ్డుపై పడబోసి వెళ్లారు రైతులు. ఇప్పుడు వర్షాల కారణంగా దిగుబడి భారీగా తగ్గిపోవడంతో.. ధర ఆమాంతం పెరిగిపోయింది.
వారం రోజుల క్రితం సెంచరీ మార్క్ దాటిన కిలో టమాటా ధర.. ఇప్పుడు 130 రూపాయలకు చేరింది. గరిష్ఠంగా రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నుల టమాటాతో కళకళలాడే మదనపల్లె మార్కెట్ యార్డు.. ఇప్పుడు కేవలం 150 మెట్రిక్ టన్నులకే పరిమితమైంది.