చిత్తురూ జిల్లాలోని పడమటి మండలాల్లోని టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాడి భానుడి భగభగల దాటికి పంటలు బాగా దెబ్బతిన్నాయి. తంబళ్లపల్లి, మదనపల్లె, వాల్మీకిపురం, పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. మదనపల్లె ప్రాంతంలో ఈ ఏడాది 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మగ్గిన టమాట...తగ్గిన ధర - andhra ooty
ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులు, ఎండవేడిమి కూరగాయల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ పేరొందిన మదనపల్లె యార్డ్లో టమాట ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఎండ తీవ్రత వల్ల టమోట పంటకు నష్టం