ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మితే రూ.2.. కొనబోతే 20

టమాటా కొనాలంటే మార్కెట్‌లో సగటున కిలో రూ.13 నుంచి రూ.20 వరకు ఉంది. అమ్మే రైతుకు మాత్రం కిలోకు రూ.2 కూడా గిట్టడం లేదు. దారి ఖర్చులకే సరిపోవట్లేదని.. తోటలోనే వదిలేస్తున్నారు కొంతమంది రైతులు.

tomatao price low in andhrapradesh
tomatao price low in andhrapradesh

By

Published : Apr 21, 2020, 7:49 AM IST

చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమాటా సాగు అధికం. మార్చి చివరి వారంలో కోత కొచ్చిన టమాటాను లాక్‌డౌన్‌ వల్ల అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల తోటలోనే వదిలేశారు. మార్కెట్లు తెరిచాక ప్రారంభంలో కొనుగోలు చేయడంలో పోటీ పెరిగి కిలోకు రూ.7 నుంచి రూ.10 వరకు రైతుబజార్లలో దక్కింది. ఇప్పుడు మళ్లీ పడిపోయి కిలోకు రూ.2 నుంచి 3 మాత్రమే లభిస్తోంది. దీంతో కొన్నిచోట్ల పొలాల్లోనే వదిలేస్తున్నారు.

- టమాటాను రైతుబజార్లలో కిలో రూ.13 - రూ.16కు విక్రయిస్తున్నారు.

పండ్లు, కూరగాయల అమ్మకాలపై ప్రభుత్వం కమీషన్‌ రద్దు చేసినా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పదిశాతం వసూలు చేస్తున్నారు.

* రైతు వంద పెట్టెల (30 కిలోల పెట్టె ధర రూ.60 చొప్పున) టమాటా అమ్మితే 96 పెట్టెలకే లెక్క కడతారు. చెల్లించాల్సిన రూ.5,760 నుంచి కమీషన్‌గా రూ.576 మినహాయించుకుంటారు. కోత కూలీ కింద రూ.వెయ్యి, రవాణా రూపంలో రూ.1,300, ఇతర ఖర్చులు రూ.500 అవుతాయి. చేతికొచ్చేది రూ.2,384 మాత్రమే.

* మార్కెట్లో వ్యాపారికి మాత్రం కమీషన్‌ కింద రూ.576, జాక్‌పాట్‌ రూపంలో రూ.240 కలిపి మొత్తం రూ.816 దక్కుతాయి.

* తోపుడుబండ్లు, చిల్లర దుకాణాల్లో కిలో రూ.20 నుంచి రూ.25 ఉంది. కొన్ని గ్రామాల్లో రూ.30 వరకు అమ్ముతున్నారు.

కమీషన్‌, జాక్‌పాట్‌ ఇవ్వాల్సిందే

30 కిలోల పెట్టె రూ.60 నుంచి రూ.70కి మించి ఇవ్వడం లేదు. ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చయింది. అందులోనూ రూ.వందకు 10శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందే. జాక్‌పాట్‌ కింద వంద పెట్టెలకు 4 పెట్టెలు ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- కృష్ణారెడ్డి, గట్టు దగ్గర నైన్‌బావి, బి కొత్తకోట, చిత్తూరు జిల్లా

ఖర్చులకే సరిపోతున్నాయి

టమాటా పెట్టెకు రూ.50 నుంచి రూ.60 మాత్రమే ఇస్తున్నారు. పెట్టె తేవడానికి రూ.13, కోయించడానికి రూ.10 అవుతుంది. కమీషన్లు, జాక్‌పాట్‌ కూడా కట్టాలి. వచ్చే డబ్బులు వీటికే సరిపోతున్నాయి.

- వి.లక్ష్మీరెడ్డి, యర్రమ్మగారిపల్లె, బి.కొత్తకోట, చిత్తూరు జిల్లా

ఇదీ చదవండి:స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు

ABOUT THE AUTHOR

...view details