చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో మాత్రం సంక్రాంతి జోష్ ఇంకా తగ్గలేదు. పండగ చివరి రెండు రోజుల్లో నిర్వహించే పశువుల పండగను ఇప్పటికి నిర్వహిస్తుండటమే అందుకు నిదర్శనం. సాధారణంగా సంక్రాంతి చివరి రెండు రోజులు పశువుల పండగను ఇక్కడి ప్రజలు వైభవంగా నిర్వహిస్తారు. పశువులను పండగ రోజున పూజించడం, అలంకరించిన అనంతరం జన సమూహంలో వాటిని వదిలి జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పండగ ముగిసినప్పటికి మండలంలో పలు చోట్ల పండగను నిర్వహించడానికి ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. కోలాహలంగా సాగిన ఈ పండగకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
వెదురు కుప్పంలో తగ్గని సంక్రాంతి జోష్ - చిత్తూరు జిల్లాలో పశువుల పండగ
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ ముగిసినా పల్లెల్లో మాత్రం ఆ జోష్ ఇంకా తగ్గలేదు. మండలంలోని పలు చోట్ల పశువుల పండగ నిర్వహించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
వెదురుకుప్పంలో కొనసాగుతున్న పశువుల పండగ