చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ చివరి రెండు రోజులు పశువుల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి మాత్రం సంక్రాంతి పండుగ అయిపోయినా చంద్రగిరి మండలంలో పశువుల పండగ కొనసాగుతూనే ఉంది. పోలీసులు నామమాత్రంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మండలంలోని భీమవరం, చిన్న రామాపురం గ్రామాల్లో ఈ రోజూ పశువుల పండుగ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు పశువులకు కట్టిన పలకలను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. పలకలను స్వాధీన చేసుకున్న యువకుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
సంక్రాంతి ముగిసినా... కొనసాగుతున్న పశువుల పండగ - cattle fight chandragiri mandal chittore news
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సంక్రాంతి అయిపోయినా.. పశువుల పండగ కొనసాగుతుంది. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు.
సంక్రాంతి ముగిసినా కొనసాగుతున్న పశువుల పండగ