ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ - తిరుపతి యువకుడి సూక్ష్మ కళ నైపుణ్యం వార్తలు

కాదేదీ కళకు అనర్హం అనే వ్యాఖ్యకు దేశభక్తి జోడించి... కాదేదీ దేశభక్తికి అనర్హం అని నిరూపించాడు తిరుపతికి చెందిన ఓ యువకుడు. పెన్సిల్ కొనపై జాతీయ గీతం, త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశభక్తిని చాటుకున్నాడు.

Tirupati youth draws National anthem on pencil lead
పెన్సిల్ కొనపై జాతీయగీతం...తిరుపతి యువకుడి ప్రతిభ

By

Published : Jan 24, 2020, 10:35 PM IST

పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ

గణతంత్ర దినోత్సవం వస్తున్న సందర్భంగా తిరుపతికి చెందిన మౌలేశ్... సూక్ష్మ కళాకృతులతో తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. జాతీయగీతం జనగణమన, త్రివర్ణ పతాకాన్ని పెన్సిల్​ కొనపై రూపొందించి ఔరా అనిపించాడు. వారంరోజుల పాటు శ్రమించి పెన్సిల్ విరగకుండా ఒకే ప్రయత్నంలో... 13 లైన్ల జాతీయగీతాన్ని, 13 పెన్సిళ్ల కొనలపై చెక్కాడు మౌలేశ్. సూక్ష్మకళలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు.

ABOUT THE AUTHOR

...view details