ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు రక్షక్​, బ్లూ కోల్ట్​ బృందాలు - latest news in chittor district

తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. అర్బన్​ పరిధిలో పది రక్షక్​, 10 బ్లూ కోల్ట్​ బృందాలు అనుక్షణం పహారా కాయనున్నట్లు చెప్పారు.

SP Venkata Appalanayudu
ఎస్పీ వెంకట అప్పలనాయుడు

By

Published : Jun 18, 2021, 3:35 PM IST

తిరుపతి అర్బన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను.. అడ్డుకునేందుకు 60 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. వీరు పది రక్షక్​, 10 బ్లూ కోల్ట్​ బృందాలుగా ఏర్పడి అనుక్షణం పహారా కాయనున్నట్లు తెలిపారు. గంజాయి వాడకం, మత్తు పానీయాల.. వంటి చట్టవిరుద్ధ చర్యలు జరగకుండా ఈ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్​కి వచ్చే అవసరం రానీవ్వకుండా.. వారి శాంతి భద్రతలను క్షేత్రస్థాయిలో పరిరక్షించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details