తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలో ధనుంజయ్ రెడ్డి అనే హోంగార్డు భార్యకు కరోనా సోకగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం అని వైద్యులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. ఇంజక్షన్ తెప్పించి.. హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంగల్ రాయలుకి ఇచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఉచితంగా ఇచ్చిన రెమిడిసివిర్ ఇంజక్షన్ ను రూ.20,400 తీసుకుని బాధిత కుటుంబానికి హోంగార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు అందించారు.
హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ
పోలీసు శాఖ తరుపున ఉచితంగా అందించిన రెమిడిసివర్ ఇంజక్షన్‌ను బాధిత కుటుంబానికి ఇచ్చి.. డబ్బులు వసూలు చేసిన హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్‌పై ఎస్పీ క్రిమినల్ కేసు నమోదు చేయించారు. వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు
విషయం తెలుసుకున్న ఎస్పీ బాధితుడి ఫిర్యాదుతో ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే చెంగల్ రాయులును సస్పెండ్ చేసి.. హోంగార్డ్స్ సంస్థ నుంచి తొలగించేందుకు సిఫార్సు చేశారు. పోలీస్ శాఖకు అప్రతిష్ఠ తీసుకువచ్చేలా.. ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. Mahanadu-2: ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు