ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికల కోడ్‌ వల్లే నిరసనకు అనుమతి ఇవ్వలేదు'

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వల్ల తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం రాత్రే నోటీసులు ఇచ్చినా నిరసనకు ప్రయత్నించారని అన్నారు.

tirupati Urban SP Venakata Appalanaidu on CBN Tour
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు

By

Published : Mar 1, 2021, 3:07 PM IST

Updated : Mar 1, 2021, 3:13 PM IST

ఎన్నికల కోడ్ వల్లే తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీవెంకట అప్పలనాయుడు తెలిపారు. నిరసనలకు ఎన్నికల సంఘం, పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఉండాలనేదే తమ ప్రయత్నం అని ఆయన అన్నారు.

'ఆదివారం రాత్రి 11 తర్వాత స్థానిక నాయకులు అనుమతి కోరారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న విషయం ప్రస్తావన లేదు. నిరసన దీక్ష చేస్తామన్న ప్రాంతం తిరుపతిలో అత్యంత కీలకమైంది. యాత్రికులు వచ్చే ప్రదేశంలో దీక్షకు అనుమతి ఇవ్వలేము. కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగుతుందని సమాచారం ఉంది. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించాం. చంద్రబాబు తిరుగు ప్రయాణానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రత్యామ్నాయ మార్గాలతో, ఎన్నికల సంఘం అనుమతితో వస్తే ఆలోచిస్తాం'- వెంకట అప్పలనాయుడు, తిరుపతి అర్బన్ ఎస్పీ

Last Updated : Mar 1, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details