ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. నాలుగో విడత జరగనున్న పల్లెపోరు ఏర్పాట్లపై.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన విధులపై సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారిస్తూ.. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు రెండు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తుది విడత పల్లెపోరు ఏర్పాట్లపై సిబ్బందితో ఎస్పీ సమావేశం - పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్ ఎస్పీ సమీక్ష
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నాలుగో విడత పల్లె పోరు ఏర్పాట్లపై పోలీసులతో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తుది దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
![తుది విడత పల్లెపోరు ఏర్పాట్లపై సిబ్బందితో ఎస్పీ సమావేశం sp review meet in srikalahasti about fourth phase panchayati elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10705258-38-10705258-1613820877217.jpg)
తుది విడత పల్లెపోరు ఏర్పాట్లపై సిబ్బందితో శ్రీకాళహస్తిలో ఎస్పీ సమావేశం