చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కర్ఫ్యూను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బాధ్యతారాహిత్యంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోపు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
శ్రీకాళహస్తిలో కర్ఫ్యూను పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ - చిత్తూరు జిల్లా ముఖ్యంశాలు
శ్రీకాళహస్తిలోని కర్ఫ్యూను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
శ్రీకాళహస్తిలో లాక్డౌన్ పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ
Last Updated : May 18, 2021, 8:04 PM IST