ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వచ్ఛ సర్వేక్షన్-2021లో తిరుపతిని మొదటి స్థానంలో నిలుపుదాం' - Tirupati municipality reviews meeting latest updates

అందరం కలిసికట్టుగా కృషి చేసి స్వచ్ఛ సర్వేక్షన్-2021లో నగరాన్ని మొదటి స్థానంలో నిలుపుదాం అని తిరువతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

tirupati-municipality
tirupati-municipality

By

Published : Dec 4, 2020, 9:16 PM IST

తడి, పొడి చెత్తలను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించేలా వ్యర్థ పదార్థాల నిర్వహణపై నగరవాసులకు అవగాహన కల్పించాలని అధికారులను తిరుపతి నగరపాలక కమిషనర్‌ విజయ్ కుమార్ ఆదేశించారు. తన కార్యాలయంలో ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2021 స్వచ్ఛ సర్వేక్షన్​కు సిద్ధం కావాలని... అందరూ కలిసికట్టుగా కృషి చేసి నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించిన తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పారిశుద్ధ్య ప్రాధాన్యతను తెలిపేలా ప్రభుత్వ గోడలపైన చిత్రాలతో కూడిన పెయింటింగ్ వేయాలన్నారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల, రైతు బజార్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద బయోచెస్ట్ యంత్రాలను వినియోగించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details