తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ పీఎస్ గిరీషా సమావేశం నిర్వహించారు. గడచిన వారం రోజులుగా తిరుపతిలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై వాలంటీర్లతో నిఘా ఉంచామన్న కమిషనర్.. క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్లకు స్వచ్ఛందంగా ప్రజలే సహకరించాలన్నారు.
తిరుపతికి వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందే!
బయటి రాష్ట్రాల నుంచి తిరుపతికి వచ్చే వ్యక్తులు స్వచ్ఛందంగా హోమ్ ఐసోలేషన్ కావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా
మహారాష్ట్ర నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఆయన.. రాత్రిపూట నగరంలో కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలన్నారు. మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేశామన్న కమిషనర్.. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హితవు పలికారు.
ఇవీ చదవండి