ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి సహకరించండి' - koyambedu market news

చెన్నై కోయంబేడు మార్కెట్‌ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన నేపథ్యంలో... పొరుగునే ఉన్న చిత్తూరు జిల్లాపై ఆ ప్రభావం పడింది. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు.

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రెస్​మీట్​
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా ప్రెస్​మీట్​

By

Published : May 9, 2020, 2:28 PM IST

చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా.... చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతానికి తిరుపతిలో కోయంబేడు మార్కెట్​ కేసుల ప్రభావం లేదన్నారు. స్విమ్స్​లో కొవిడ్ కేసుల్లో వైద్యసహాయం అందిస్తున్న సిబ్బంది ఒకరు కరోనా బారిన పడినట్లు తెలిపారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉంటూ వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details