ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ttd: ప్రకృతిసిద్ధ సంచుల్లో.. శ్రీవారి ప్రసాదం! - chittoor district latest news

తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు తితిదే త్వరలో ఎకోలాస్టిక్‌ బ్యాగుల్లో అందించనుంది. త్వరలోనే లడ్డూ విక్రయ కేంద్రంలో ఈ సంచులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

ttd
ttd

By

Published : Jul 22, 2021, 9:11 AM IST

తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు తితిదే త్వరలోనే కంపోస్టబుల్‌ ఎకోలాస్టిక్‌ సంచుల్లో అందించనుంది. బెంగళూరులోని డీఆర్‌డీవో ఎకోలాస్టిక్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో పర్యావరణ అనుకూల సంచులను తయారుచేసింది. వీటి వాడకానికి అనుమతించిన తితిదే.. ధరలు ఖరారు చేసింది.

ఐదు లడ్డూలు పట్టే చిన్న సైజు సంచికి రూ.2, పది చిన్న లడ్డూలు లేదా మూడు పెద్ద లడ్డూలు పట్టే మధ్యరకం సంచికి రూ.5 చొప్పున తీసుకోనుంది. బుధవారం తయారీ సంస్థ ప్రతినిధులు కంపెనీ ఉత్పత్తులను స్వామివారి వద్ద ఉంచి ఆశీర్వాదం అందుకున్నారు. త్వరలోనే లడ్డూ విక్రయ కేంద్రంలో సంచులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details