తిరుపతి ఐఐటీలో ఆకట్టుకుంటున్న తిరు ఉత్సవ్ - tirupathi iit college tiru ustav news in telugu
చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో తిరు ఉత్సవ్ ఘనంగా జరుగుతుంది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో పాటు జిల్లాలోని వివిధ విద్యా సంస్థల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నైపుణ్య ప్రదర్శనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోబోటిక్, ఫన్ ఫీట్, టెక్నికల్ షో, బైక్ రైడింగ్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కేరింతలతో ఐఐటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.