ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం - tirupathi voters fires on fake votes

తమ ఓట్లు వేరే వ్యక్తులు వేశారని తిరుపతి ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రానికి వస్తే.. అప్పటికే ఓటు వేశారంటూ వెనక్కి పంపించేశారని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు దొంగ ఓట్లు వేయడానికి తాము వచ్చామని కొంతమంది మహిళలు అంగీకరించారు.

tirupathi  voters fires on fake voters
tirupathi voters fires on fake voters

By

Published : Apr 17, 2021, 3:52 PM IST

Updated : Apr 17, 2021, 7:12 PM IST

తిరుపతి ఓటర్ల ఆగ్రహం

నకిలీ ఓటర్లుఓటేయటంతో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని తిరుపతి నగర ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్ కేంద్రానికి వస్తే.. అప్పటికే ఓటు వేశారంటూ వెనక్కి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 16, 17 ఏళ్ల పిల్లలు కూడా నకిలీ ఓటేసేందుకు వచ్చారని.. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే అక్కడినుంచి పారిపోయారన్నారు.

మరోవైపు బయట ప్రాంతాల మహిళలు బస్సుల్లో రావటం, మొహాలు దాచుకుంటూ పక్కనుంచి జారుకోవటం.. దొంగ ఓట్లు వేశారనే అనుమానం మరింత బలపరుస్తోందన్నారు. సమావేశం ఉందంటూ తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్నారు.

tirupathi voters fires on fake voters

ఇదీ చదవండి: తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. దండెత్తిన దొంగ ఓటర్లు..!

దొంగ ఓట్లు వేయడానికి తాము వచ్చామని కొంతమంది మహిళలు అంగీకరించారు. కొంతమంది బస్సులో వెళ్తుండగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోగా... తమని దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చినట్లు తెలియదని ఒప్పుకున్నారు. ఈ సారికి తప్పైందని... మళ్లీ ఇలాంటి తప్పు చేయమని మహిళలు అంటున్నారు. వారంతా చిత్తూరు నుంచి వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'

Last Updated : Apr 17, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details