ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో గీత దాటితే కేసులే: అర్బన్ ఎస్పీ - తిరుపతి అర్బన్ ఎస్పీ

తిరుపతి అర్బన్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. అభ్యర్థుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్ నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది.. సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.

tirupathi urban sp on fourth phase elections
సామాజిక మాధ్యమాల్లో గీత దాటితే కేసులే: అర్బన్ ఎస్పీ

By

Published : Feb 10, 2021, 8:37 PM IST

చిత్తూరు జిల్లా నాలుగో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తంగా పనిచేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశించారు. తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న కేంద్రాలను ఆయన పరిశీలించారు. అభ్యర్థులంతా స్వేచ్ఛగా తమకున్న హక్కును వినియోగించుకునేలా.. పోలీసు యంత్రాంగం సహకరించాలని సూచించారు.

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్ నెంబర్లను కేటాయించామన్న ఎస్పీ.. అభ్యర్థులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తమకు నేరుగా తెలియజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details