వాహనాల నుంచి అధిక శబ్ధం వచ్చే బుల్లెట్ వాహనాలపై తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బుల్లెట్ వాహనాల సైలెన్సర్లకు అధిక శబ్దం వచ్చే మఫ్లర్లను వాడుతున్న వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. బుల్లెట్ వాహనాల శబ్ద కాలుష్యంపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డికి ఫిర్యాదులు అందడంతో.. వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్సీ, సీఐలు నగరంలోని ప్రధాన కూడలిలో తనిఖీలు నిర్వహించి బుల్లెట్ వాహనాలను సీజ్ చేశారు.
బుల్లెట్ నడుపుతున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే - తిరుపతిలో బుల్లెట్ వాహనాలు
బుల్లెట్ వాహనాలు వినియోగిస్తున్నవారు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందే అంటున్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ. అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు.. క్రమ శిక్షణ చర్యల కింద ట్రాఫిక్ వాలంటరీగా విధులు కేటాయిస్తామని హెచ్చరించారు.
tirupathi urban sp