తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం జరిగింది. తిరుపతిలో జనచైతన్య లేఅవుట్ వద్ద రెండు కోట్ల రూపాయలతో ఉద్యానవనం నిర్మాణం, ప్రకాశం పార్కు అభివృద్దికి 85 లక్షల రూపాయలు కేటాయిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
నగరంలో జరుగుతున్న గరుడ వారధి, భూగర్భ విద్యుత్ కేబుల్ పనులతో పాటు ఇతర పనుల పురోగతిపై సమీక్షించారు. పనులు శరవేగంగా పూర్తి చేయాలని, ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎన్.భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి, తుడా వీసీ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.