తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు... తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ.. తన బృందంతో కలిసి పలు కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేనే రోడ్డుపైకి రావాలని సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
తిరుపతిలో పోలీసులు అప్రమత్తం.. వాహనదారులకు హెచ్చరికలు - తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
తిరుపతిలో లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారికి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
తిరుపతిలో పోలీసులు అప్రమత్తం..వాహనదారులకు హెచ్చరికలు