తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు.. సర్వం సిద్ధం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. ఇప్పటికే 70శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తైందనీ.. ఇంకా అందని వాళ్ల కోసం వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తిరుపతి వాసులు సైతం నగరానికి వచ్చి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలకు సర్వ సన్నద్ధం' - తిరుపతి మున్సిపల్ ఎన్నికలు న్యూస్
తిరుపతి మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు.. నగరపాలక కమిషనర్ తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీ 70 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. ఓటరు స్లిప్పులు అందని వారి కోసం వార్డు సచివాలయ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
![తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలకు సర్వ సన్నద్ధం' tirupathi municipal commissioner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10931911-141-10931911-1615278362781.jpg)
నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా