ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకం' - తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ సమావేశం

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని.. మేయర్ శిరీష అన్నారు. శానిటరీ ఇన్స్​పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలతో మేయర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

review
review

By

Published : May 28, 2021, 10:16 PM IST


తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని.. మేయర్ శిరీష అన్నారు. కమిషనర్ గిరీషాతో కలిసి శానిటరీ ఇన్స్​పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలతో మేయర్.. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రతిరోజు సక్రమంగా జరగాలన్నారు. యూజర్ ఛార్జీలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్​లు ప్రతి షాపునకు తప్పనిసరిగా ఉండి తీరాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏమైనా సమస్యలు ఎదురవుతుంటే తమ దృష్టికి కానీ లేదా స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధిత నగరంగానే తిరుపతి ఇప్పటికీ కొనసాగుతోందని.. ప్లాస్టిక్​ను వినియోగించే వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details