ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొనసాగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర ' - తిరుపతి తాతయ్యగుంట

రాయలసీమలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. భారీగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.

'వైభవంగా కొనసాగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర '

By

Published : May 14, 2019, 12:47 PM IST

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభోవోపేతంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా ఎనిమిదో రోజు... అమ్మవారికి బంగారు ముఖ కవచం, వెండి కిరీటాన్ని అలంకరించారు. భక్తులు సప్పరాలతో ఆలయానికి చెరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిత్యం వేలాదిగా గంగమ్మను దర్శించుకుంటూ... పొంగళ్లు, నైవేథ్యాయాలు, నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు.

'వైభవంగా కొనసాగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర '

ABOUT THE AUTHOR

...view details