తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వేసవిలో భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు. తిరుమలలో అన్నిచోట్లా రసాయనాలతో నిత్యం శుభ్రపరిచేలా చర్యల చేపడుతున్నట్లు ధర్మారెడ్డి వివరించారు. భక్తులను పరీక్షించేందుకు థర్మల్ గన్స్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 నుంచి వసతి గదులకు కాషన్ డిపాజిట్ అమలు చేస్తామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
అడ్వాన్స్ బుకింగ్ కోటా 50 శాతానికి తగ్గింపు