కంటైన్మెంట్ జోన్‌గా తిరుపతి: నగర పాలక కమిషనర్
12:21 April 26
తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా నగర పాలక కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులున్నాయని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలోని వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని కమిషనర్ గిరీషా సూచించారు.
కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా.. తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ గిరీషా ప్రకటించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో దాదాపు 10వేల మందికి పాజిటివ్ నిర్ధరణ అయిందని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని గిరీషా సూచించారు. కొవిడ్ కట్టడి లక్ష్యంగా.. మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని ఛాంబర్ కామర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గంగమ్మ జాతర సైతం ఏకాంతంగా జరిపేందుకు ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు.
ఇదీ చదవండి: తిరుమలపై కరోనా ప్రభావం... 15 నిమిషాల్లోనే దర్శనం..