రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేసేందుకు తీసుకున్న నిర్ణయంపై దేవస్థానం రక్షణ సమితి నాయకులు అభ్యంతరం తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.
దేవాలయ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఎంతో మంది భక్తులు దేవదేవుడికి ఆస్తులు విరాళంగా ఇచ్చారని, అలాంటి ఆస్తులను ప్రభుత్వం నిరర్థక ఆస్తులుగా చూపించి, వేలం వేయడం సరైంది కాదన్నారు. తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.