ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.3309 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్​

తిరుమల తిరుపతి దేవస్థానం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ను రూపొందించింది. ఆదాయాల పెంపు, ఖర్చుల తగ్గింపుపై దృష్టి సారించిన పాలకమండలి అందుకు అనుగుణంగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో పాటుగానే శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పంచాంగాన్ని విడుదల చేసింది.

tirumala tirupati devastanam
తితిదే వార్షిక బడ్జెట్​తోపాటు.. పంచాంగం విడుదల

By

Published : Mar 1, 2020, 3:16 PM IST

Updated : Mar 1, 2020, 8:12 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,309కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్​కు ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య భవన్​లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో 150 అంశాలపై చర్చించిన సభ్యులు పలు అంశాలకు ఆమోదం తెలిపారు. యాత్రికుల వసతి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చిన పాలకమండలి, గరుడ వారధి నిర్మాణంలో ప్రాజెక్ట్ డిజైన్స్ పై.. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నుంచి స్పష్టత కోరింది.

తితిదే నూతన పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పంచాంగాన్ని విడుదల చేసింది. శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని పంచాంగాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్​కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర బోర్డు సభ్యులతో కలసి ఆవిష్కరించారు. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తితిదే కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో పంచాంగం అందుబాటులో ఉంచనున్నారు.

ఇవీ చూడండి...

తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స

Last Updated : Mar 1, 2020, 8:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details