ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 19న ఆర్జిత సేవలను రద్దుచేసిన తితిదే - తితిదే తాజా సమాచారం

సూర్యజయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను అధికారులు వెల్లడించారు.

tirumala tirupati devastanam canceled the special services on the 19th of this month
ఈ నెల 19న ఆర్జిత సేవలను రద్దుచేసిన తితిదే

By

Published : Feb 9, 2021, 5:09 PM IST

సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19వ తేదీ రథసప్తమి ఉత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించనుంది. ఆ రోజున తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై దర్శనమివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సేవల వివరాలు

ఉ 5.30 - ఉ. 08.00 - సూర్యప్రభ వాహనం

ఉ. 9.00 - ఉ. 10.00 - చిన్నశేష వాహనం

ఉ. 11.00 - మ. 12.00 - గరుడ వాహనం

మ. 1.00 - మ. 2.00 - హనుమంత వాహనం

మ. 2.00 - మ. 3.00 - చక్రస్నానం

సా. 4.00 - సా. 5.00 - కల్పవృక్ష వాహనం

సా. 6.00 - సా. 7.00 -సర్వభూపాల వాహనం

రా. 8.00 - రా. 9.00 -చంద్రప్రభ వాహనం

ఇదీ చదవండి:మూడు రోజుల తరువాత ప్రత్యక్షమైన సర్పంచ్‌ అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details