తిరుమలలో రెండో రోజు తితిదే ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా భౌతికదూరం పాటిస్తూ.. ఆలయంకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 7.30 గంటల వరకు ఉద్యోగులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. క్యూలో భౌతికదూరం పాటించడంతో పాటు, శుభత్రను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కొండ ఎక్కాలంటే... దర్శన టిక్కెట్లు తప్పనిసరి - తిరుమల శ్రీవారి దర్శనం వార్తలు
తిరుమల శ్రీవారి దర్శనం రెండో రోజు సిబ్బందితో కొనసాగుతోంది. రేపు ఉదయం నుంచి తిరుమలలో ఉన్న స్థానికులకు దర్శన ఆవకాశం కల్పించేందుకు ఈరోజు టోకెన్లను జారీ చేశారు. 11వ తేదీ నుంచి టిక్కెట్లు కలిగిన భక్తులందరినీ స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. దర్శన టిక్కెట్లు కలిగిన వారిని మాత్రమే కొండపైకి ఆనుమతిస్తారు.
రేపు ఉదయం నుంచి తిరుమలలో ఉన్న స్థానికులకు దర్శన ఆవకాశం కల్పించేందుకు ఈరోజు టోకెన్లను జారీ చేశారు. 12 కౌంటర్ల ద్వారా 6 వేల టిక్కెట్లను అందిస్తున్నారు. 11వ తేదీ నుంచి టికెట్లు కలిగిన భక్తులందరినీ స్వామివారి దర్శనంకు అనుమతించనున్నారు. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించిన తితిదే.. రేపటి నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఉచిత టైంస్లాట్ టోకెన్లను జారీ చేయనుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల జారీని ప్రారంభించనుంది. దర్శన టోకెన్లు తీసుకునే భక్తులు ముందురోజే వాటిని పొందాల్సి ఉంటుంది. దర్శన టికెట్లు కలిగిన వారిని మాత్రమే కొండపైకి ఆనుమతిస్తారు.