ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకు అడుగడుగునా తనిఖీలు - తిరుమల తాజా వార్తలు

తిరుమలలో స్వామి వారి దర్శనాలు పున:ప్రారంభమవుతున్నందున తితిదే పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకూ అడుగడుగునా తనిఖీలు నిర్వహించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బుక్‌ చేసుకుని వస్తే మంచిదని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

tirumala temple re open
tirumala temple re open

By

Published : Jun 7, 2020, 7:18 AM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను ఈ నెల 8 నుంచి అనుమతించనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటిదాకా భక్తులను అలిపిరి టోల్‌గేట్‌ దగ్గర భద్రత సిబ్బంది భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇకపై భక్తులే స్వయంగా తమ జేబులు పూర్తిగా బయటకు తీసి, మహిళలు హ్యాండ్‌బ్యాగులను తెరచి చూపించాలి. తితిదే సిబ్బంది హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్‌తో పరిశీలిస్తారు.

భక్తులు గమనించాల్సిన అంశాలు

*భక్తుల లగేజీ సహా వాహనాలను అలిపిరి దగ్గరే శానిటైజ్‌ చేస్తారు. దర్శనం టికెట్లు ఉన్నవారినే కొండపైకి అనుమతిస్తారు.
*అలిపిరి దగ్గర 12 వరుసల్లో ప్రవేశ మార్గాలుండగా.. శానిటైజేషన్‌కు వీలుగా ఒకరోజు ఆరు, మరుసటిరోజు మిగిలిన ఆరింటిని తెరిచి వాహనాలను అనుమతిస్తారు.
*ముందురోజు తిరుపతికి వచ్చి ఆధార్‌కార్డుతో పాటు ఐరిస్‌ ద్వారా సర్వదర్శనం టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకు గంటల వారీగా కోటా మేరకు టికెట్లు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ మార్చారు.
*సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండులోని కౌంటర్ల నుంచి పొందవచ్చు. రద్దీని బట్టి శ్రీనివాసంలోనూ కౌంటర్‌ తెరిచే అవకాశముంది.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడం మంచిది: ఈవో
దూరప్రాంతాల భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లను బుక్‌ చేసుకుని వస్తే మంచిదని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఇవి ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది పదిహేను నిమిషాల్లో అయిపోతున్నాయని, తిరుపతికి వచ్చాక తీసుకుదాంలే అనుకుంటే దొరక్కపోవచ్చన్నారు. సర్వదర్శనం టిక్కెట్లు కూడా తిరుపతి సమీప ప్రాంతాల వారికే అయిపోవచ్చని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details