కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ - ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ
తిరుమలలో భద్రతాపరమైన హెచ్చరికలు ఉన్నాయని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికలు లేవని ఆయన స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని పేర్కొన్నారు.
![కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4244676-thumbnail-3x2-tirupati.jpg)
tirupati sp
కంగారు పడకండి..ఇవి సాధారణ తనిఖీలే..: తిరుపతి ఎస్పీ
తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికల్లేవని.. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని... తిరుపతి ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తిరుపతి పటిష్టమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని... భక్తులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్టు ఎస్పీ వివరించారు.
Last Updated : Aug 26, 2019, 1:23 PM IST