తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించిన టికెట్లను తితిదే వెబ్సైట్లో అధికారులు విడుదల చేశారు. రోజుకు 9 వేల టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావాలనుకునే భక్తులు tirupathibalaji.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసపోవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధికారులు విడుదల చేశారు. జులై నెలకు సంబంధించిన టికెట్లను తితిదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
కొవిడ్ - 19 నిబంధనల మేరకు 10 సంవత్సరాలలోపు వారికి.. 65 సంవత్సరాలు పైబడిన వారికి టికెట్లు పొందేందుకు అవకాశం లేదని తెలిపింది. సాధారణ భక్తుల కోసం మంగళవారం ఉదయం నుంచి రోజుకు మూడు వేల టిక్కెట్ల చొప్పున ఉచిత టైంస్లాట్ టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవీ కాంప్లెక్స్ వద్ద టోకెన్లు జారీ చేయనున్నారు. దర్శనం కోరుకునే వారు ఒక్కరోజు ముందు ఈ కేంద్రాల ద్వారా టైంస్లాట్ టోకెన్లను పొందాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:చమురు ఆగ్రహం: కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు