ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త పరికరాల కొనుగోలులో ప్రతిష్టంభన! - tirumala tirupati devasthanams latest news

తితిదే ఆలయాల్లో భద్రతను పటిష్ఠం చేసేందుకు కొత్త పరికరాల కొనుగోలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఒకసారి టెండరు ప్రక్రియ పూర్తి చేసి తక్కువ ధర వేసి సంస్థను గుర్తించినా.. దాన్ని రద్దు చేసి మరోమారు వెళ్లాల్సిందిగా తితిదే కొనుగోలు కమిటీ సూచించింది. తాజాగా మళ్లీ టెండరు ప్రక్రియ పూర్తి చేసి భద్రతా పరికరాలను అందజేసే సంస్థను గుర్తించే పనిలో తితిదే విజిలెన్స్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

tirumala security equipment news tender
కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ కమిటీ ప్రతిపాదన

By

Published : Oct 30, 2020, 6:20 PM IST

తితిదే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 25 ఎక్స్‌రే బ్యాగేజీ స్కానర్ల ఏర్పాటుకు విజిలెన్స్‌, భద్రతా విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఎనిమిది స్కానర్ల స్థానంలో కొత్తవాటిని అందించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం పరికరాలు తయారు చేసే అసలు సంస్థల నుంచి కొనుగోలు చేయడం ద్వారా తితిదేకు ఖర్చు తగ్గుతుందని భావించారు. ఎక్స్‌రే బ్యాగేజీ స్కానర్ల కొనుగోలు ప్రతిపాదనను.. కొనుగోలు కమిటికీ నివేదించగా ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెరడర్లు పిలిచేందుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. దీనికి అనుగుణంగా టెండరు ప్రక్రియ చేపట్టగా మూడు సంస్థలు పాల్గొన్నాయి. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 17న అలిపిరి వద్ద వీటి పనితీరుకు సంబంధించిన సాంకేతిక అంశాలను అదనపు సీవీఎస్‌వో, డీఈ(విద్యుత్తు), వీఎస్‌వో, ప్రధాన అకౌంట్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం నుంచి డీఎస్పీ స్థాయి అధికారితో ఉన్న కమిటీ సభ్యుల సమక్షంలో పరిశీలించారు. కేవలం రెండు సంస్థలు ముందుకు వచ్చి తమ పరికరాల పనితీరును కమిటీ ఎదుట ప్రదర్శించాయి. సాంకేతిక విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆర్థిక బిడ్లను తెరిచేందుకు సభ్యులు అనుమతించడంతో. టెండర్లు తెరిచారు. ఇందులో ఒక సంస్థ రూ.11.93 కోట్లకు.. మరో సంస్థ రూ.8.34 కోట్లకు టెండరు వేశాయి. వాస్తవానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో వివిధ పరికరాల కొనుగోలుకు తితిదే తమ బడ్జెట్‌లో రూ.10.50 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక బిడ్లలో రెండు సంస్థలు దాఖలు చేసిన బిడ్ల వివరాలను కొనుగోలు కమిటీ ముందుంచారు. టెండరు నిబంధనలను అనుసరించి తక్కువ ధరకు ముందుకు వచ్చిన సంస్థకు పనులు ఆమోదించాలా వద్దా అనేది సూచించాల్సిందిగా కోరారు.

నిబంధనలను సడలించండి

ఈ విషయమై కొనుగోలు కమిటీ సభ్యులు మే నెలలో మరోమారు సమావేశమై ప్రస్తుతం ఉన్న కొన్ని నిబంధనలు సడలించాలని సూచించారు. అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రస్తుతం మన దేశంలో ఆ సంస్థల విక్రయాల అనుభవం రెండేళ్ల నుంచి ఐదేళ్లు ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ముగ్గురు సాంకేతిక నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అటువంటి సంస్థలను గుర్తించేందుకు చూడాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఆగస్టులో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు.. ఈ ప్రతిపాదనలకు మండలి ఆమోదముద్ర వేసింది. దాంతో మరోమారు టెండర్లు పిలిచి కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి :

టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే

ABOUT THE AUTHOR

...view details