ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శనివారాలు ప్రారంభం - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వార్తలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు...తిరుమల శనివారాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధికసంఖ్యలో అలిపిరికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

tirumala
తిరుమల శనివారాలు ప్రారంభం

By

Published : Sep 19, 2020, 3:09 PM IST

పెరటాసి మాసం పురస్కరించుకుని... తిరుమల శనివారాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలిపిరి పాదాల మండపం భక్తులతో కిక్కిరిసింది. వార్షిక బ్రహ్మోత్సవాల మొదటి రోజు... తిరుమల శనివారాల మొదటి శనివారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో అలిపిరికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు శ్రీవారి పాదాల మండపంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ABOUT THE AUTHOR

...view details