'సుదీర్ఘ కాలం శ్రీవారి సేవలో పాల్గొనటం అదృష్టం' - jeo
తిరుమల జేఈవోగా పని చేసి బదిలీ అయిన శ్రీనివాసరాజు.. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను పని చేసిన కాలంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చానని గుర్తు చేశారు.
శ్రీవారి సేవలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు
తిరుమల జేఈవో పని చేసి బదిలీ అయిన శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీనివాసరాజు దంపతులను అర్చకులు, ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి ఘనంగా సత్కరించారు. తన పదవీ కాలంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీవారి సేవలో 8 సంవత్సరాల రెండు నెలల 14 రోజుల పాటు పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.